TG: రాష్ట్రంలో ఇవాళ జరిగిన IASల బదిలీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మహబూబాబాద్ కలెక్టర్గా స్నేహా శబరీష్ బదిలీ కాగా.. అదే జిల్లాకు ఆమె భర్త శబరీష్ ఎస్పీగా పనిచేస్తుండటం విశేషం. ఒకే జిల్లాకు భార్యాభర్తలు కలెక్టర్, ఎస్పీలుగా ఉండటం తెలంగాణలో ఇదే రికార్డ్. స్నేహ గతంలో హన్మకొండ కలెక్టర్గా పనిచేశారు.