కర్నూలు: తాగునీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇంజినీరింగ్ విభాగ అధికారులు, సచివాలయ, తాగునీటి సరఫరా విభాగ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పీ. విశ్వనాథ్ సూచించారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఇంజినీరింగ్ విభాగ అధికారులతో పాటు జూమ్ ద్వారా అమినిటీస్ కార్యదర్శులతో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు.