NGKL: రాబోయే వేసవి కాలంలో నాగర్కర్నూల్ జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని గురువారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. గ్రామ, పట్టణ స్థాయిలలో నీటి పంపులు, పైపులైన్ల మరమ్మతులు, పారిశుధ్య పనులు సకాలంలో పూర్తి చేసి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు.