»Tdp Chief Nara Chandrababu Naidu Fire On Anaparthi Lathi Charge
Chandrababu Naidu పెద్దాపురంలో లేని ఆంక్షలు అనపర్తిలో ఎలా?
సజ్జల డైరెక్షన్ లోనే పోలీసులు అరాచకం సృష్టించారని తెలిపారు. పోలీసులు కావాలనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్త ప్రకాశ్ నాయుడి గుండెలపై తీవ్రంగా దాడి చేశారని, అతడి పరిస్థితి విషమంగా ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఇదేం కర్మ-మన రాష్ట్రానికి’ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) అడుగడుగునా ఆంక్షలు సృష్టించడంపై తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో నిర్వహించాల్సిన సభను పోలీసులు ఆకస్మికంగా అనుమతులు రద్దు చేయడం తీవ్ర వివాదం రేపింది. మొదట అనుమతి ఇచ్చి అనంతరం రద్దు చేయడం కలకలం రేపింది. దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం అనపర్తిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలో పోలీసులు అత్యుత్సాహంతో కార్యకర్తలు, నాయకులపై లాఠీలు ఝుళిపించారు. లాఠీచార్జ్ లో పార్టీ నాయకులు గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని శనివారం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు.
ఆస్పత్రిలో కార్యకర్తలను పరామర్శించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘అనపర్తిలో పోలీసులను పురిగొల్పారు. వారిని కొందరు రెచ్చగొట్టడంతోనే అమాయకులైన టీడీపీ కార్యకర్తలు, నాయకులపై పోలీసులు లాఠీచార్జ్ కు పాల్పడ్డారు. ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని గుర్తించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. అనపర్తిలో దాడి వెనుక అదే కారణం. ముందు రోజు అనపర్తిలో బహిరంగ సభ నిర్వహణకు అనుమతి ఇచ్చి.. ఆ తర్వాత అనుమతి రద్దు చేయడం వింతగా ఉంది. జగ్గంపేట పెద్దాపురంలో లేని ఆంక్షలు అనపర్తిలో ఎందుకు వచ్చాయి?’ అని ప్రశ్నించారు. ‘ప్రతిపక్షాలు నిర్వహించే సభలను అడ్డుకోవాలి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది’ అని చంద్రబాబు ఆరోపణలు చేశారు.
అయితే ఆంధ్రప్రదేశ్ లో కొందరు పోలీసులు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు వింటున్నారని చంద్రబాబు ఆరోపించారు. సజ్జల డైరెక్షన్ లోనే పోలీసులు అరాచకం సృష్టించారని తెలిపారు. పోలీసులు కావాలనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్త ప్రకాశ్ నాయుడి గుండెలపై తీవ్రంగా దాడి చేశారని, అతడి పరిస్థితి విషమంగా ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రకాశ్ నాయుడిని పరామర్శించిన చంద్రబాబు ధైర్యం చెప్పారు. పార్టీ నీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
‘ఇదేం కర్మ-మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఏపీలో పర్యటిస్తుంటే అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు. ‘ఇదేం కర్మ- మన రాష్ట్రానికి’ (Idem Kharma Mana Rashtraniki) అనే పేరుతో మూడు రోజుల పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తూర్పు గోదావరి (East Godavari District) జిల్లాలో శుక్రవారం చంద్రబాబు పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకోగా అకస్మాత్తుగా పోలీసులు అనుమతి (Permission Cancelled) నిరాకరించారు. సభ రద్దు చేసినట్లు పోలీసులు నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. దీంతో తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.