Governor Tamilsai : సీఎం కేసీఆర్ కి బర్త్ డే విషెస్ చెప్పిన గవర్నర్ తమిళిసై
Governor Tamilsai : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు 69వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖులు, అభిమానులు, పార్టీ కార్యకర్తల నుంచి శుభాకాంక్షలు వెల్లువెతుతున్నాయి. కాగా... అలా శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో... గవర్నర్ తమిళిసై కూడా ఉండటం విశేషం.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు 69వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖులు, అభిమానులు, పార్టీ కార్యకర్తల నుంచి శుభాకాంక్షలు వెల్లువెతుతున్నాయి. కాగా… అలా శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో… గవర్నర్ తమిళిసై కూడా ఉండటం విశేషం.
నిజానికి గవర్నర్ తమిళిసైకి, సీఎం కేసీఆర్ కి ఈ మధ్య అస్సలు పడటం లేదు. వారి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమణేలా అభిప్రాయ బేధాలు ఉన్నాయి. వారి మధ్య సఖ్యత లేదు అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్ సైతం ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో మంత్రులు కూడా ఆమెపై పలు వ్యాఖ్యలు చేయడం ఇటీవల దుమారం రేగింది.
ఈ మధ్య అసెంబ్లీ బడ్జెట్ విషయంలో గవర్నర్ ప్రసంగంపై కోర్ట్ మెట్లుకూడా ఎక్కేంతవరకూ వెళ్ళింది వీరి వివాదం. వ్యక్తిగతంగా తనను అవమానించినా, రాజ్యాంగపరంగా గవర్నర్ పదవికి మర్యాద ఇవ్వాలని అప్పట్లో సూచించారు తమిళిసై. అయితే… ఎన్ని అభిప్రాయ బేధాలు ఉన్నా… వాటన్నింటినీ పక్కన పెట్టి మరీ… ఆమె కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం విశేషం.