PDPL: రోడ్లపై ధాన్యం ఆరబోసి రాకపోకలకు అంతరాయం కలిగించవద్దని కాల్వ శ్రీరాంపూర్ ఎస్సై వెంకటేష్ హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ.. వరి, మొక్కజొన్న కోతలు మొదలైన నేపథ్యంలో రహదారులపై పంటను పోయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వాహనదారులు భద్రత దృష్ట్యా రైతులు పోలీసులకు సహకరించాలని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.