HYDలోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అత్యాధునిక ‘A&M మోషన్ క్యాప్చర్ ల్యాబ్’ను రాజమౌళి ప్రారంభించారు. ‘బాహుబలి’, ‘ఈగ’ సమయంలో లేని ఈ సాంకేతికత ఇప్పుడు అందుబాటులోకి రావడం సంతోషకరమని, దీనితో భారతీయ సినిమాల స్థాయి మారుతుందని ఆకాంక్షించారు. ‘వారణాసి’ కోసం ఈ టెక్నాలజీని వాడామని, ఫలితాలు అద్భుతంగా వచ్చాయని రాజమౌళి వెల్లడించారు.