NZB: మోస్రా మండలం గోవూరు గ్రామంలో ఇవాళ ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ ధన్వాల్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సంబంధిత సిబ్బందికి ఆయన సూచించారు.