»Manoj Bajpayee Wants Samantha To Go Easy On Herself Her Reply Is Viral
Samantha: సమంతలాగే మనసు కూడా అందమైనది
నటి సమంత (samantha ruth prabhu) సోషల్ మీడియాలో (Social Media) చురుగ్గా ఉంటున్నారు. తాజాగా ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నారో తెలియదు... కాబట్టి అందరిపై దయ చూపండి అంటూ అనే కాప్షన్ రాసి, ఇన్‌స్టాలో ఫోటోను షేర్ చేసింది. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు.
నటి సమంత (samantha ruth prabhu) సోషల్ మీడియాలో (Social Media) చురుగ్గా ఉంటున్నారు. తాజాగా ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నారో తెలియదు… కాబట్టి అందరిపై దయ చూపండి అంటూ అనే కాప్షన్ రాసి, ఇన్‌స్టాలో ఫోటోను షేర్ చేసింది. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు. సమంత లాగే, ఆమె మనసు కూడా చాలా అందమైనది అంటూ కితాబిస్తున్నారు. ఇటీవలె ఆమె బాక్సింగ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. ఇదిలా ఉండగా, ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయి ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో సమంత పైన ప్రశంసలు కురిపించారు. ఏదీ పట్టించుకోకుండా ముందుకు సాగిపో అని సూచించారు. సమంత చాలా కష్టపడే మనిషి అని, ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సమయంలో ఆమె పని తీరును చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పారు. సీన్ చాలా బాగా రావడానికి ఆమె తన శరీరాన్ని ఎంత కష్టపెట్టేందుకైనా సిద్ధపడుతుందన్నారు. ఏదీ పట్టించుకోకుండా ముందుకు సాగిపో అన్న మనోజ్ మాటలకు సమంత స్పందిస్తూ.. ప్రయత్నిస్తాను సర్ అంటూ స్పందించారు. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పాయితో పాటు అశ్లేషా ఠాకూర్, సమంత, ప్రియమణి, శ్రేయ ధన్వంతరి తదితరులు నటించారు.