RCBతో జరిగిన మ్యాచ్లో ఓటమిపై గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందించాడు. ‘ఇన్నింగ్స్ ముగింపు దశలో బ్యాటర్లు తడబడటం ఓటమికి ప్రధాన కారణం. ముఖ్యంగా 16వ ఓవర్ నుంచి 19వ ఓవర్ వరకు ఆశించిన స్థాయిలో బౌండరీలు రాకపోవడం వల్ల జట్టు స్కోరు 220 దాటాల్సిన చోట 205 దగ్గరే ఆగిపోయింది. డెత్ ఓవర్లలో బ్యాటర్లు మరింత వేగంగా ఆడాల్సి ఉండేదని’ అని అభిప్రాయపడ్డాడు.