Ram Charan Dance : ఆర్సీ 15 షూటింగ్ ఉందంటే చాలు.. లీకులు ఆటోమేటిగ్గా బయటకొచ్చేస్తున్నాయి. ఇంతకు ముందు శంకర్ సినిమాలకు ఎప్పుడు ఇలా జరగలేదు. అసలు సెట్లో ఏం జరుగుతుందో.. అక్కడున్న వారికి తప్పా.. ఇంకెవరికి తెలియదు. కానీ ఆర్సీ 15 మాత్రం అలా కాదు.
ఆర్సీ 15 షూటింగ్ ఉందంటే చాలు.. లీకులు ఆటోమేటిగ్గా బయటకొచ్చేస్తున్నాయి. ఇంతకు ముందు శంకర్ సినిమాలకు ఎప్పుడు ఇలా జరగలేదు. అసలు సెట్లో ఏం జరుగుతుందో.. అక్కడున్న వారికి తప్పా.. ఇంకెవరికి తెలియదు. కానీ ఆర్సీ 15 మాత్రం అలా కాదు. ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ వచ్చినట్టు.. సరికొత్త లీకులు వస్తునే ఉన్నాయి. ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతునే ఉన్నాయి. అయితే దీనంతటికి కారణం.. అవుట్ డోర్ షూటింగ్ అనే చెప్పొచ్చు. ఈ సినిమా స్టూడియో, సెట్టింగ్స్లలో కంటే పబ్లిక్ ప్లేసుల్లోనే ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకుంది. పొలిటికల్ కంటెంట్ కావడంతో.. జన సాంద్రత ఉండే ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నాడు శంకర్. అందుకే ఎక్కువగా లీకులు జరుగుతున్నాయని చెప్పొచ్చు. తాజాగా ఓ సాలిడ్ లీక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం చరణ్ ఇంట్రో సాంగ్ షూటింగ్‌తో బిజీగా ఉంది చిత్ర యూనిట్. చార్మినార్, కొండారెడ్డి బురుజు, గీతం యూనివర్సిటీ, సంహాచలం వంటి ప్రదేశాల్లో షూట్ చేస్తున్నారు. ఇక ఈ సాంగ్ థియేటర్లో పూనకాలు తెప్పిస్తుందని అంటున్నారు. ఈ సాంగ్‌లో 80 సెకండ్స్ పాటు సాగె ఒక స్టెప్ని.. చరణ్ జస్ట్ సింగిల్ టేక్‌లో కంప్లీట్ చేశాడట. చరణ్ డ్యాన్స్ చూసి శంకర్‌తో పాటు యూనిట్ మొత్తం షాక్ అయిందట. మామూలుగానే చరణ్ స్టెప్పులు అదరహో అనేలా ఉంటాయి. అలాంటిది నిమిషానికి పైగా నాన్‌స్టాప్ స్టెప్ అంటే.. థియేటర్ షేక్ అవడం పక్కా అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇక దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సునీల్, ఎస్ జె సూర్య, అంజలి, శ్రీకాంత్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.