బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్, శ్రీలీల డేటింగ్లో ఉన్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఈ డేటింగ్ రూమర్స్ వేళ కార్తీక్ ఇంట్లో శ్రీలీల కనిపించారు. అక్కడ జరిగిన వినాయక చవితి పూజల్లో తన తల్లితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఆలస్యంగా బయటకొచ్చాయి. దీంతో నెటిజన్లు.. వారిద్దరూ ప్రేమలో ఉన్నట్లు కన్ఫామ్ అయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.