GNTR: రెడ్డిపాలెం గ్రామంలో క్షుద్ర పూజల కలకలం చోటుచేసుకుంది. గ్రామ శివారులో అనుమానాస్పద క్షుద్ర పూజలు జరుగుతున్నాయనే సమాచారం అందుకున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే నల్లపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పూజలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.