TG: గ్రూప్-1కు సంబంధించి హైకోర్టు తీర్పుపై టీజీపీఎస్సీ సమీక్షించనుంది. ఇప్పటికే గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి కాగా.. తుది నియామకాలు పెండింగ్లో ఉన్నాయి. దీంతో టీజీపీఎస్సీ తదుపరి నిర్ణయంపై అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా, టీజీపీఎస్సీ రివ్యూకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.