SKLM: రాష్ట్ర ప్రభుత్వం మందస జీడి కార్మికులు సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని సీఐటీయూ నాయకులు, జీడి కార్మిక సంఘ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం కాల్చిన పిక్కలు అక్రమ తరలింపు ఆపాలని ఆర్ అండ్ బి బంగ్లా నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. జీడి కార్మికులకు పూర్తిస్థాయి పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు.