MLG: మల్లంపల్లి మండలం రామచంద్రపూర్, పందికుంట గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాలను ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంగళవారం సందర్శించారు. ఆయిల్ పామ్ సాగు, ఎరువుల వాడకం, పంట దిగుబడి, కాలపరిమితి, లాభాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. పాఠ్యపుస్తకాలతో పాటు ప్రత్యక్ష అనుభవం విద్యార్థుల సృజనాత్మకతను పెంచుతుందని, విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన ఉంటుందని ఉపాధ్యాయులు తెలిపారు.