వనపర్తి డిపో నుంచి వివిధ మార్గాలలో మొత్తం 56 బస్సులు నడుస్తున్నాయని డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. ఇందులో 15 ఆర్టీసీ బస్సులు, 41 అద్దె బస్సులు ఉన్నాయి. హైదరాబాద్, కర్నూలు, మహబూబ్నగర్, పెద్దకొత్తపల్లి, ఘనపూర్, ఆత్మకూరు, పెబ్బేర్ తదితర రూట్లలో సేవలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 15 ఆర్టీసీ బస్సులను ప్రైవేట్ డ్రైవర్లతో నడిపిస్తున్నట్లు తెలిపారు.