TG: మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. చెన్నమనేని ఏ పాస్ పోర్ట్పై ట్రావెల్ చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. జర్మనీ పాస్ పోర్టుపై ట్రావెల్ చేస్తున్నారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. అయితే పాస్ పోర్టు ప్రామాణికం కాదని కోర్టుకు తెలిపారు. ఇండియన్ పాస్ పోర్టు ఉందా అని కోర్టు ప్రశ్నించడంతో.. లేదని చెన్నమనేని తరపు న్యాయవాది తెలిపారు. తుది తీర్పు హైకోర్టు వాయిదా వేసింది.