AKP: హోంమంత్రి వగలపూడి అనిత చొరవతో ఎస్ రాయవరం మండలం పెదగుమ్ములూరులో చెరువులు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు మాజీ ఎంపీపీ యేజర్ల వినోద్ రాజు తెలిపారు. గురువారం ఓ కంపెనీకి చెందిన ప్రతినిధులు గ్రామంలో ఎర్ర చెరువు, రాతి చెరువులను పరిశీలించారు. చెరువుల మరమ్మతులకు సీఎస్ఆర్ నిధులు మంజూరు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.