జగిత్యాలలో గురువారం జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. మార్కెట్లో గిరాకీ ఉన్న సన్నరకం వరి సాగు విస్తరణ, ఆయిల్ పామ్ పెంపు, యూరియా బుకింగ్ యాప్ వినియోగం, సహజ వ్యవసాయంపై చర్చించారు. సమావేశానికి అదనపు కలెక్టర్ బి.ఎస్. లత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాణ్యమైన విత్తనాలు రైతులకు సమయానికి అందించాలని అన్నారు.