పార్వతీపురం శ్రీ సాయిరాం డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కరస్పాండెంట్ రెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో టాటా ఎలక్ట్రానిక్స్, టాటా టయో రేడియేటర్స్, అపోలో టైర్స్, బ్లూ స్టార్ ఎలక్ట్రిక్, ఎజాకిల లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.