MDCL: కుషాయిగూడ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ధర్నాకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మెను భగ్నం చేసే కుట్ర జరుగుతోందని, కుట్రలు కాదు కావాల్సింది పరిష్కారమని తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేదంటే ఉద్యమం ఉదృతం చేస్తామని పేర్కొన్నారు.