KMR: ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చిన ఫిర్యాదులను అధికారులు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. సంబంధిత శాఖలకు పంపి పరిష్కారం చేయించాలని చెప్పారు.