సిరిసిల్ల: పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ తాజా మాజీ సర్పంచులు సిరిసిల్ల పట్టణంలో చేపట్టిన దీక్షలు సోమవారం 4వ రోజుకు చేరుకుంది. కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచులు మాట్లాడుతూ.. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరారు. పది నెలలుగా బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామన్నారు.