W.G: భీమవరం పట్టణంలో సోమవారం జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణరాజు(RRR) పాల్గొన్నారు. విధి నిర్వహణలో తమ ప్రాణాలు అర్పించిన పోలీసులకు నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో శాంతిభద్రతలను కాపాడటమే లక్ష్యంగా పోలీసులు పని చేస్తున్నారని చెప్పారు. వారి సేవలు వెలకట్టలేనివని అన్నారు.