MDK: జిల్లాలో ఆర్టీసీ సమ్మె శాంతియుతంగా నిర్వహించాలని ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. సమ్మె ప్రజాస్వామ్య హక్కే అయినప్పటికీ అశాంతికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్, రవాణాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. డీపోలు, బస్టాండ్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.