MDK: నిజాంపేట మండలం కల్వకుంట, తిప్పనగుళ్ల గ్రామానికి వెళ్లే మార్గంలో గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం ఉదయం వెలుగుచూసింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు కల్వకుంట, తిప్పనగుళ్లకి చెందిన వ్యక్తి కాదని తేలడంతో వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.