NTR: విజయవాడలో ‘వివేకానంద సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్’లో ఆత్మవికాస్-2026 సమ్మర్ క్యాంప్ ఈ నెల 27 నుంచి మే 9 వరకు నిర్వహించనున్నారు. 4వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ధ్యానం, యోగా, వేద పఠనం, భజనలు, లీడర్షిప్ స్కిల్స్, చరిత్ర నిర్మాణంపై శిక్షణ ఇవ్వనున్నారు. ఉదయం 8.30 నుంచి 11.30 వరకు తరగతులు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.