కోనసీమ: యువత మాదకద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్ అన్నారు. అమలాపురం రూరల్ సమనస గ్రామంలో మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో బుధవారం మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐ పాల్గొని మాట్లాడుతూ… యువత వ్యసనాలకు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.