JN: దేవరుప్పుల మండలం నిర్మలా గ్రామానికి చెందిన BRS పార్టీ వార్డు సభ్యుడు కల్వల నగేష్, సీనియర్ నాయకుడు కడబోయిన సోమన్న BRS పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సేవ పట్ల ఆకర్షితులై చేరుతున్నట్లు తెలిపారు.