»Nandamuri Ramakrishna Escaped Safely In Car Accident
NTR కుటుంబానికి మరో షాక్.. రామకృష్ణకు కారు ప్రమాదం
నందమూరి కుటుంబానికి (Nandamuri Family) రోడ్డు ప్రమాద గండం ఉందని కనిపిస్తోంది. ఈ కుటుంబసభ్యులు తరచూ రోడ్డు ప్రమాదాలకు (Road Accident) గురవుతున్నారు. రోడ్డు ప్రమాదం రూపంలో ఇప్పటికే నందమూరి కుటుంబం చాలా విషాదాలు ఎదుర్కొన్నది.
నందమూరి కుటుంబానికి (Nandamuri Family) రోడ్డు ప్రమాద గండం ఉందని కనిపిస్తోంది. ఈ కుటుంబసభ్యులు తరచూ రోడ్డు ప్రమాదాలకు (Road Accident) గురవుతున్నారు. రోడ్డు ప్రమాదం రూపంలో ఇప్పటికే నందమూరి కుటుంబం చాలా విషాదాలు ఎదుర్కొన్నది. ప్రస్తుతం యువ నటుడు నందమూరి తారకరత్న(Nandamuri Taraka Ratna) గుండెపోటుకు గురై ఆస్పత్రిలో ఉండడంతో ఆ కుటుంబం కలత చెందింది. తారకరత్న ఘటనను మరువకముందే ఆ కుటుంబాన్ని మరో ఘటన కలచి వేసింది. సీనియర్ ఎన్టీఆర్ (NT Rama Rao) కుమారుడు నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna) రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తెల్లవారుజామున బయటకు వచ్చిన రామకృష్ణ కారు ప్రమాదానికి గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో అతడు క్షేమంగా బయటపడగా.. కారు మాత్రం నుజ్జనుజ్జయ్యింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు, నందమూరి బాలకృష్ణ (Balakrishna) సోదరుడు రామకృష్ణ శుక్రవారం తెల్లవారుజామున బయటకు వచ్చాడు. జూబ్లీహిల్స్ (Jubilee Hills) రోడ్డు నంబర్-10లో వెళ్తుండగా కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో కారు తీవ్రంగా దెబ్బ తింది. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. అయితే కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు రాకపోవడం గమనార్హం. అయితే ప్రమాదంలో రామకృష్ణకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో నందమూరి కుటుంబం ఊపిరి పీల్చుకుంది.
నందమూరి కుటుంబానికి రోడ్డు ప్రమాదాల గండం పొంచి ఉంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ (Harikrishna) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. అనంతరం ఎన్టీఆర్ సోదరుడు నందమూరి జానకీ రామ్ (Janaki Ram) కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆ రెండు ఘటనలు నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. వరుస ప్రమాదాలతో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తీవ్రంగా కలత చెందాడు. తన ప్రతి సినిమాలో రోడ్డు ప్రమాదం విషయంలో అవగాహన కల్పిస్తున్నాడు. సినిమా ముగింపులో జాగ్రత్తగా ఇళ్లకు వెళ్లండి అంటూ హెచ్చరికతో కూడిన సూచన తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటున్నాడు. ఇక ఏ వేడుకకు హాజరైన కూడా ఎన్టీఆర్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే.
కాగా టీడీపీ యువ నాయకుడు నారా లోకేశ్ ప్రారంభించిన యువగళంలో తారకరత్న గుండెపోటుకు గురయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. తారకరత్నను బెంగళూరులో రామకృష్ణ పరామర్శించి కొన్ని రోజులు అక్కడే గడిపి వచ్చారు. రామకృష్ణ గతంలోనే ఒక ప్రమాదంలో గాయపడగా.. తాజాగా మళ్లీ ప్రమాదానికి గురవడంతో ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
రామకృష్ణ కూడా సినీ పరిశ్రమలో ఉన్నారు. గతంలో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. కాగా తారకరత్న ఆరోగ్య విషయమై ఇటీవల నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) స్పందించారు. తారకరత్న ఆరోగ్యం మెరుగైందని.. ప్రస్తుతం కోలుకుంటున్నాడని అమిగోస్ (Amigos) ప్రీ రిలీజ్ (Pre Release Event) వేడుకలో తెలిపాడు. వైద్యులు అద్భుతంగా వైద్యం అందిస్తున్నాడని పేర్కొన్నాడు. త్వరలోనే మన మధ్యకు తారకరత్న వస్తాడని కల్యాణ్ రామ్ ప్రకటించాడు.