»Mla Raja Singh Arrived On Bullet To Assembly Sessions
Pragathi Bhavan వద్ద కారు పడేసి.. Bulletపై అసెంబ్లీకి రాజాసింగ్
రాజా సింగ్ ఇటీవల తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇతర వర్గాలను కించపరుస్తూ, దూషిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాడు. తన సోషల్ మీడియా ద్వారా ఇతర వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడు. దీనికి ప్రభుత్వం స్పందించి అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించింది. ఒక ఎమ్మెల్యేపై పీడీ చట్టం ప్రయోగించడం బహుశా దేశంలో మొదటిసారి కావొచ్చు.
పాత కారు ఇవ్వడంతో తరచూ మొరాయిస్తోంది. ప్రయాణిస్తుండగా రోడ్డుపైనే అకస్మాత్తుగా వాహనం ఆగిపోతుంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) పట్టించుకోవడం లేదు. ముందే అతడి ప్రాణానికి ప్రమాదం పొంచి ఉంది. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం కేటాయించిన కారును ప్రగతి భవన్ (Pragathi Bhavan) వద్ద పడేశాడు. డొక్కు కారు మీరే తీస్కోండి అంటూ ముఖ్యమంత్రి కార్యాలయం (Telangana CMO) వద్ద పడేసి వెళ్లిపోయాడు. కారు లేకపోవడంతో బుల్లెట్ (Bullet) పై డుగ్గు డుగ్గంటూ అసెంబ్లీ (Assembly)కి వచ్చేశాడు. అతడే బీజేపీ (BJP) గోషామహాల్ (Goshamahal) ఎమ్మెల్యే రాజా సింగ్. వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న రాజా సింగ్ (Raja Singh) శనివారం బుల్లెట్ పై అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యాడు. ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ ద్వి చక్ర వాహనంపై తన గన్ మెన్ తో కలిసి వచ్చాడు.
ప్రస్తుతం తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు (Telangana Budget Session) కొనసాగుతున్నాయి. సమావేశాలకు హాజరరై వెళ్తుండగా గురువారం రాజా సింగ్ కారు ప్రమాదానికి గురైంది. ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో వాహనం టైర్ ఊడిపోయింది. వేగం నెమ్మదిగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రాజా సింగ్ ఆ కారును శుక్రవారం ప్రగతి భవన్ వద్ద వదిలేశాడు. ప్రభుత్వానికి మొర పెట్టుకుంటానంటే పోలీసులు వారించారు. ప్రగతి భవన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. చివరికి రాజా సింగ్ పంజాగుట్ట పోలీసులు (Punjagutta Police) అదుపులోకి తీసుకున్నారు. కానీ కారు మాత్రం ప్రగతి భవన్ వద్దే వదిలేశాడు. పోలీసులు వెంటనే ఆ కారును పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం రాజా సింగ్ కు ప్రభుత్వం కేటాయించిన కారు లేదు.
బుల్లెట్ ప్రూఫ్ కారు లేకపోవడంతో శనివారం అసెంబ్లీ సమావేశాలకు రాజా సింగ్ బైక్ పై వచ్చాడు. తన గన్ మెన్ తో కలిసి సమావేశాలకు హాజరు కాగా ముందు పోలీసులు అనుమతించలేదు. వివరాలు సేకరించిన అనంతరం లోపలికి అనుమతించారు. ప్రభుత్వం తనకు కేటాయించిన బులెట్ ప్రూఫ్ కారు పాతది కావడంతో దానికి నిరసనగా బైక్ పై అసెంబ్లీ కి వచ్చాడు. ఈ సమస్యపై అసెంబ్లీలో రాజా సింగ్ నిలదీస్తున్నాడు. కాగా రాజా సింగ్ ఇటీవల తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇతర వర్గాలను కించపరుస్తూ, దూషిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాడు. తన సోషల్ మీడియా ద్వారా ఇతర వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడు. దీనికి ప్రభుత్వం స్పందించి అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించింది. ఒక ఎమ్మెల్యేపై పీడీ చట్టం ప్రయోగించడం బహుశా దేశంలో మొదటిసారి కావొచ్చు. ఈ కేసులో రాజా సింగ్ కొన్నాళ్లు జైల్లో ఉండి వచ్చాడు. ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇటీవల ముంబైలో జరిగిన ఓ బహిరంగ సభలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బెయిల్ కు ఇచ్చిన షరతులను ఉల్లంఘించడంతో పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.