Palla Rajeshwar Reddy: తెలంగాణను ఎవ్వరు ఇవ్వలేదని, కొట్లాడి తెచ్చుకున్నామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారని స్పష్టం చేశారు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో పోలీసులు విద్యార్థులపై దాడి చేశారు. మార్పు అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ప్రగతి భవన్కు కంచెలు పెట్టామన్న కాంగ్రెస్.. అసెంబ్లీ ముందు కొత్త కంచెలు పెట్టిందని రాజేశ్వర్ ఆరోపించారు. ప్రగతి భవన్ కంచెలకు డబుల్ కంచెలు అసెంబ్లీ ముందు పెట్టారన్నారు.
ఇంతకు ముందు వెయ్యి మంది పోలీసులు ఉంటే ఇప్పుడు మూడువేల మంది పోలీసులు ఉంటున్నారని ఆరోపించారు. 60 రోజుల పాలనలో ఇదేనా మార్పు అని ప్రశ్నించారు. అసలు మార్పు అంటే కట్టిన బిల్డింగ్లకు పేరు మార్చడం, నంబర్ ప్లేట్లు మార్చడం కాదని, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరికైనా రూ.10 లక్షలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు.