Boyapati Srinu: బోయపాటి శ్రీను సినిమా.. హీరో ఎవరు?
టాలీవుడ్ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ఒకరు. చివరగా ఆయన స్కంద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే అతని తర్వాతి సినిమా గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి అతని తర్వాతి సినిమా ఏ హీరోతో తెలుసుకుందాం.
Boyapati Srinu: టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ఒకరు. ఆయన చివరగా రామ్ పోతినేని స్కంద మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తర్వాత సినిమా ఏంటి అనేదానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ మీద దర్శకుడు బోయపాటి శీనుతో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి హీరో అల్లు అర్జున్ అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు దీనిలో ఓ ట్విస్ట్ వచ్చి పడింది. అల్లు అర్జున్తో కాకుండా మరో హీరోతో మూవీ తీస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో బోయపాటి, అల్లు అర్జున్ కాంబినేషన్లో సరైనోడు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సరైనోడు తర్వాత బోయపాటితో సినిమా చేయాలని అల్లు అర్జున్ కమిట్మెంట్ ఇచ్చాడు. అయితే పుష్ప 2 కాకుండా మరో మూడు ప్రాజెక్టులు లైన్లో ఉండటంతో ఈ సినిమాకి డేట్స్ ఇవ్వడం కష్టంగా మారింది. ఇది కాకుండా బోయపాటితో బాలయ్య కాంబినేషన్లో మరో సినిమా చేయాల్సి ఉంది. అఖండ 2 కథ సిద్ధంగా ఉందని సమాచారం. 14 రీల్స్ నుంచి అడ్వాన్స్ తీసుకున్న బాలయ్య దాన్ని బోయపాటితో చేయించేలా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఇంకోవైపు ఏవేవో ప్రచారాలు జరుగుతున్నాయి.
తాజాగా మరో హీరో ఈ లైన్ లోకి వచ్చాడు. ఫ్యామిలీ స్టార్ దర్శకుడు పరశురామ్ ని దిల్ రాజుకి లాక్ చేయించడం కోసం వేరే సినిమా చేస్తానని రౌడీ హీరో విజయ్ దేవరకొండ గతంలో మాటిచ్చాడట. బోయపాటి శీను రాసుకున్న స్టోరీ అతని ఇమేజ్ కి సరిపోయేలా ఉండటంతో ఈ కలయికని సాధ్యం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని వినికిడి. అధికారికంగా చెప్పేవరకు ఇదంతా సస్పెన్స్ అనే చెప్పాలి. బన్నీ గురించి క్లారిటీ వచ్చేసింది కాబట్టి బాలకృష్ణ లేదా విజయ్ దేవరకొండ ఈ ఇద్దరిలో ఒకరితోనే బోయపాటి శీను మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడు అని మాత్రం తెలుస్తోంది.