KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ముచ్చటగా మూడోసారి అధికారం చేపడుదామనుకొని చతికిల పడింది. అధికారం ఉన్నా లేకున్నా.. తాము ప్రజలకు అందుబాటులో ఉంటామని అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). తెలంగాణ భవన్లో నేతలతో సమావేశం అయ్యారు.
సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు హాజరయ్యారు. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించారు. ఓడిపోయిన నియోజకవర్గాల్లో పరిస్థితులపై సమీక్షించారు. భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. గెలిచిన అభ్యర్థులకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ అద్భుత కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. బీఆర్ఎస్ పార్టీ గౌరవ ప్రద స్థానాలను సాధించిందని తెలిపారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామని.. ఆ బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశానికి మల్లారెడ్డి అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరు కాలేదు. దీంతో ఏం జరిగిందనే అంశం చర్చకు వచ్చింది. సిటీలో ఉండి.. రాకపోవడంతో.. పార్టీ మారాతారా అనే చర్చ జరుగుతోంది.