జనగామ: దేవరుప్పుల మండల BRS కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ రూ.2లక్షల రుణమాఫీ పూర్తి చేయాలని, రేపు తొర్రూర్లో తలపెట్టిన రైతు ధర్నాకు రైతులు అధిక సంఖ్య కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో BRS మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.