»Private Vehicles Rushed To Formula E Racing Track
Formula E Racing : ఫార్ములా ఈ రేసింగ్ ట్రాక్ పైకి దూసుకొచ్చిన ప్రైవేటు వాహనాలు
బారికేడ్లను తోసేసి వాహనదారులు ట్రాక్ పైకి వచ్చారు. ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు రేపు ప్రారంభం కాబోతున్నాయి. ట్రాక్ పైకి ఇతర వాహనాలు రావడంతో రేసింగ్ ప్రాక్టీస్ ను వాయిదా వేశారు. ట్రాక్ పై సెక్యూరిటీ లోపం ఉండటంతో...
Formula E Racing : హైదరాబాద్ లోని నెక్లస్ రోడ్ ప్రాంతంలో ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు జరగనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో రేసింగ్ కోసం నెక్లస్ రోడ్ మొత్తాన్ని పోలీసులు బ్లాక్ చేశారు. దీంతో అటువైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. దీంతో ఆ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. రేసింగ్ కారణంగా రేసింగ్ జరిగే చుట్టుపక్కన ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు పోలీసులు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోతున్నాయి. ఈనేపథ్యంలో కొందరు వాహనదారులు ట్రాఫిక్ జామ్ ను తట్టుకోలేక ఫార్ములా ఈ రేసింగ్ పైకి దూసుకొచ్చారు.
బారికేడ్లను తోసేసి వాహనదారులు ట్రాక్ పైకి వచ్చారు. ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు రేపు ప్రారంభం కాబోతున్నాయి. ట్రాక్ పైకి ఇతర వాహనాలు రావడంతో రేసింగ్ ప్రాక్టీస్ ను వాయిదా వేశారు. ట్రాక్ పై సెక్యూరిటీ లోపం ఉండటంతో దాని గురించి పోలీసులతో రేసింగ్ నిర్వాహకులు చర్చిస్తున్నారు.
Formula E Racing : రేసులు ముఖ్యమా? మేము ముఖ్యమా? ప్రశ్నించిన వాహనదారులు
మీకు రేసులు ముఖ్యమా? లేక మేము ముఖ్యమా? అంటూ వాహనదారులు పోలీసులను ప్రశ్నించారు. రేపటి రేస్ కోసం ఇవాళ ప్రాక్టీస్ రేస్ ప్రారంభం అయింది. కానీ.. మధ్యలో ప్రైవేటు వాహనాలు ట్రాక్ మీదికి వెళ్లడంతో రేస్ ను నిర్వాహకులు ఆపేశారు. ఆ తర్వాత ట్రాఫిక్ ను క్లియర్ చేసి మళ్లీ రేస్ ను ప్రారంభించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగుతల్లి ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు రేస్ తో నగరవాసులు ట్రాఫిక్ జామ్ తో తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు.