MHBD: ఇనుగుర్తి రైతు వేదికలో గురువారం మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాల అమలు, పురోగతిపై శాఖల వారీగా సమీక్ష జరగనుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.