AP: ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు తపాలా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 11 నగరాల్లో 24 గంటలూ స్పీడ్ పోస్ట్, పార్సిల్ బుకింగ్ సేవలను అందించనుంది. ఆ జాబితాలో విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి, అనంతపురం, రాజమండ్రి, ఒంగోలు, గుంతకల్ ఉన్నాయి. అలాగే, మరో 242 పట్టణాల్లో సబ్ పోస్టాఫీస్‌ల పనివేళలను రెండు గంటలు పెంచింది.