TG: BRS పార్టీ నుంచి కాంగ్రెస్లోకి చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులపై ఈ నెల 27, 28 తేదీల్లో వీరిద్దరిని స్పీకర్ వ్యక్తిగతంగా విచారించనున్నారు. తొలుత BRS ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై, ఆ తర్వాత బీజేపీ సమర్పించిన పిటిషన్పై విచారణ జరగనుంది.