BDK: గుర్తుతెలియని వ్యక్తులు బీరువా తాళాలు పగలగొట్టి బంగారం నగలు చోరీ చేసిన ఘటనపై పినపాక పోలీస్ స్టేషన్ శుక్రవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పినపాకకు చెందిన ఏలేటి సంజీవరెడ్డి అనారోగ్య చికిత్స నిమిత్తం హాస్పిటల్కి వెళ్ళగా, దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు పగలగొట్టి దొంగతనం చేసినట్టుగా పోలీసులు తెలిపారు.