ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ ప్లాట్‌ఫారమ్ ‘గ్రో’ మాతృసంస్థ.. బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ షేర్లు మార్కెట్లో రికార్డు స్థాయి లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ‘బ్యాంక్ ఆఫ్ అమెరికా’ ఈ స్టాక్‌కు అత్యధిక టార్గెట్ ధరను ప్రకటించడమే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.