ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో ఉన్న ఓ బంగారు గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా గనిలో కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. కొందరు వ్యక్తులు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.