ప్రకాశం: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్పై ఆరోపణలు చేశారు. మంగళగిరిలో జనసేనలో చేరిన తర్వాత బాలినేని మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ వీరాభిమానిని, జగన్కు మనమంటే లెక్కలేని తనమని, జగన్ పెట్టిన పార్టీ కోసం 4ఏళ్లు మంత్రి పదవి ఉన్నా వదులుకొని వైసీపీకి పనిచేశానని చెప్పారు. తనకు పదవులు ముఖ్యం కాదని, విలువ, గౌరవం ముఖ్యమని అన్నారు.