HNK: హన్మకొండ నగరంలో అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మంగళవారం సూచించారు. అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫైర్ సర్వీస్ ఫ్లాగ్ ఆవిష్కరించి, అమరులైన సిబ్బందికి నివాళులర్పించారు. అనంతరం గోడపత్రికలను ఆవిష్కరించారు.