MBNR: జిల్లా కేంద్రంలో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో పార్టీలకతీతంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు బీజేపీ పెద్దపీట వేస్తుందని, ప్రధాని మోదీ హయాంలో 33 శాతం రిజర్వేషన్ బిల్లు చారిత్రాత్మకమని కొనియాడారు. ఇందులో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, స్థానిక మహిళలు పాల్గొన్నారు.