TG: మహబూబ్నగర్ జిల్లాలో చెరువులో గల్లంతైన ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. రెండు రోజుల క్రితం జడ్చర్ల మండలం గొల్లపల్లి చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మృతులు నవీన్, యాదగిరిగా గుర్తించారు. వారి మృతదేహాలను గ్రామస్తులు ఈ రోజు బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.