తమిళ స్టార్ హీరో కార్తీ, సీనియర్ నటుడు అరవింద్ స్వామి కాంబినేషన్లో దర్శకుడు ప్రేమ్ కుమార్ ‘సత్యం సుందరం’ మూవీని రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చాయి. తాజాగా మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో అరవింద్, కార్తీ.. బావ- బావమరిదిగా నటించారు. కాగా ఈ నెల 28న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.