టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. చెన్నై వేదికగా బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్లు తీయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. ఈ సంవత్సరం బుమ్రా మొత్తంగా 14 మ్యాచులు 20 ఇన్నింగ్స్‌ల్లో 47 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో హాంగ్ కాంగ్ బౌలర్ ఎహ్సన్ ఖాన్ 46 వికెట్లతో రెండో స్థానంలో ఉండగా.. శ్రీలంక బౌలర్ హసరంగా 43 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.