TG: హైదరాబాద్లోని ఓ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం మొదలైంది. ఈ సమావేశానికి AICC బాధ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ హాజరయ్యారు. అయితే ఇటీవల తాను BRS పార్టీలోనే ఉన్నానని గాంధీ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీఎల్పీ సమావేశానికి హాజరుకావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.